పెట్రోల్ బాటిల్ తో మహిళ హల్ చల్..
ఫుట్ పాత్ పై అక్రమంగా తన మిల్క్ పాయింట్ తొలగించారని ఆరోపిస్తూ… మహిళ పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేసింది. ఉప్పల్ చిలుకానగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై ఆక్రమణల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు.. కల్యాణపురి పార్క్ వద్ద మిల్క్ పాయింట్ ను తొలగించారు. ఈ క్రమంలో అధికారులను అడ్డుకుని మహిళ ఇష్టం వచ్చిన్నట్లు బూతులు తిట్టింది. జీహెచ్ఎంసీ బుల్డోజర్ ముందు కూర్చొని ఆందోళనకు దిగింది. అన్యాయంగా తన పాల బూత్ ను కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకొని మహిళ హల్ చల్ చేసింది. అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బా పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు మహిళ బైఠాయించింది. అయితే.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

