Home Page SliderNational

బెంగళూరులో దారుణం.. తల్లిని చంపి సూట్‌కేస్‌లో పెట్టిన కుమార్తె

బెంగళూరు నగరంలో దారుణ సంఘటన జరిగింది. కన్నతల్లినే పొట్టనపెట్టుకుంది ఒక కుమార్తె. అంతేకాక ఆమెను సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి, దానితో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. బెంగళూరులోని మికో లేఅవుట్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. తల్లి తరచుగా గొడవ పడుతోందని సెనాలి అనే వివాహిత తన తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసింది. తన తల్లి,అత్త, భర్తతో కలిసి బెంగళూరులోని అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది సెనాలి. ఆమె ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తోంది. హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని ట్రాలీ సూట్‌కేస్‌లో పెట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. విషయం పోలీసులకు వివరించి లొంగిపోయింది. ఆమెను చూసి, నివ్వెరపోయిన పోలీసులు అరెస్టు చేసి, కేసు విచారిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో సెనాలి భర్త ఇంట్లో లేడని, ఆమె అత్త ఇంట్లో ఉన్నా ఆమెకు తెలియదని చెప్పినట్లు తెలిసింది.