కోతి కారణంగా మహిళ దుర్మరణం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో 50 ఏళ్ల మహిళ కోతి బారి నుండి తప్పించుకోబోయి దుర్మరణానికి గురయ్యింది. బోనగోని లక్ష్మి అనే బీడీ కార్మికురాలు కోతిమూక కారణంగా ప్రాణాలు కోల్పోయింది. కోతుల మూక వారి ఇంటిపై దాడి చేయడంతో ఆమె తప్పించుకోవాలని ప్రయత్నించి, తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందారు. దీనితో ఆమె భర్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఊరిలో కోతుల గుంపుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

