Home Page SliderTelangana

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. కుటుంబ సభ్యుల నిరసన

కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. హాస్పిటల్ ముందు మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన మమత, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చింది. ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇంజక్షన్ వికటించి మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట మహిళ మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.