Home Page SliderTelangana

మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్ లోని జంజారాహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. మోమోస్ తిని మహిళ చనిపోయింది. ఈ ఘటన బంజారాహిల్స్ లోని నందినగర్ లో జరిగింది. వీటిని తిన్న మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారాంతపు సంతలో మోమోస్ పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. బంజారాహిల్స్ పరిధిలో జరిగే వారాంతపు సంతలో మోమోస్ విక్రయించారని స్థానికులు అంటున్నారు. సింగాడికుంట, నందినగర్, వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో మోమోస్ బాధితులు ఉన్నట్లు తెలిసింది. సింగాడికుంటకు రేష్మా అనే మహిళ గత వారం మోమోస్ తిని తీవ్ర అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మోమోస్ షాప్ నిర్వహించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.