Home Page SliderNational

క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన మహిళ

గత కొద్ది రోజుల నుండి క్యాబ్ డ్రైవర్లపై కస్టమర్లు దుర్భాషలాడుతూ విచక్షణరహితంగా విరుచుకుపడుతున్నారు. అలాంటిదే ఓ షాకింగ్ ఘటన ముంబయి మహా నగరంలో చోటు చేసుకుంది. ముంబయి ఎయిర్ పోర్టు ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ ను దుర్భాషలాడుతూ, చితకబాదింది. ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా తీసుకురావడంతో విమానం మిస్సయిందని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవర్ పై దాడికి ఆమె పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే, ఇందులో డ్రైవర్ తప్పు ఏమీ లేదని ఆ మహిళే ఆలస్యంగా ఇంటి నుంచి బయలుదేరినట్లు సమాచారం. దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ముంబయి ట్రాఫిక్ పోలీసులను కోరారు. బాధిత క్యాబ్ డ్రైవర్ వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని నెటిజన్లు సూచించారు.