రోడ్డెక్కిన పోలీసుల భార్యలు
తెలంగాణలోని సిరిసిల్లలో పోలీసుల భార్యలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. నగరంలోని అంబేద్కర్ చౌరస్తాలో 17వ బెటాలియన్‌కు చెందిన పోలీసుల భార్యలు ధర్నా చేస్తున్నారు. వారి భర్తల ఉద్యోగానికి, పోలీస్ డ్యూటీకి, వారి చేత చేయిస్తున్న పనులకు సంబంధం లేదంటూ ఆందోళనలు చేస్తున్నారు. వారిచేత కూలీ పనులు, చెత్త సేకరణ, మట్టి పనులు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే నల్గొండ, వరంగల్‌లో కూడా పోలీసుల భార్యలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో పోలీసుల విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరుతున్నారు. ‘ఏక్ పోలీస్’ విధానం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

