Home Page SliderNational

వీసా లేకుండా చెక్కేయండి, భారతీయులకు ఆ దేశం బంపర్ ఆఫర్

పొరుగు దేశాలతో చెలిమి ఎంతో అవసరం. కానీ మనకు పొరుగున ఉన్న చాలా దేశాలు గిల్లికజ్జాలు పెడుతున్న పరిస్థితుల్లో శ్రీలంక అనూహ్య నిర్ణయం తీసుకుంది. పలు దేశాలకు వీసా లేకుండా ఎంట్రీ అవకాశమిచ్చిన శ్రీలంక, ఇండియాకు సైతం ఆ ఛాన్స్ ఇచ్ిచంది. తాజాగా శ్రీలంక కమ్యూనిస్ట్ ప్రభుత్వం… చైనా, ఇండియా, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్ వాసులు, ఎలాంటి వీసా లేకుండానే శ్రీలంక రావొచ్చంటూ ఆ దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ విధానం తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. సాధారణ పాస్ పోర్ట్ కలిగినవారితోపాటుగా, దౌత్య, అధికారిక, పబ్లిక్ అఫైర్స్ ఉద్యోగులు ఆయా దేశాల జాతీయులు ఈ పథకం ఎసక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా శ్రీలంకలోకి అనుమతిస్తారు.

ఈ పథకం కింద పర్యాటకులు 30 రోజుల ఉచిత వీసా వ్యవధిని ఆస్వాదించవచ్చు. శ్రీలంకకు మొదటిసారి వచ్చిన తేదీ నుండి 30 రోజులలోపు డబుల్ ఎంట్రీ సౌకర్యం కూడా పొందవచ్చు. ఉచిత వీసా పొందిన 30 రోజుల కంటే ఎక్కువ కాలం శ్రీలంకలో ఉండాల్సిన దరఖాస్తుదారులు తగిన వీసా రుసుము చెల్లించి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక వీసా ఏడు దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుండి 2024 నుండి భారతీయులకు ఫ్రీ వీసా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం ద్వారా 6 నెలల వరకు శ్రీలంకలో ఉండేందుకు ఛాన్స్ ఉంది. శ్రీలంకలో ఉండాలనుకున్న చివరి తేదీ నుండి 6 నెలల వరకు పాస్‌పోర్ట్ తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలి. శ్రీలంకకు వెళ్లాలంటే ఇకపై ఏ వీసా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
టూరిస్ట్ వీసా ఇమ్మిగ్రేషన్ వద్ద అక్కడికక్కడే జారీ చేయబడుతుంది.