నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసి, నామినేషన్ల పరిశీలన కూడా పూర్తయింది. ఇక నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తయిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 83 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు తేలింది. మొత్తం మునుగోడు ఉప ఎన్నికకు 130 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన సమయంలో 47 నామినేషన్ లను అధికారులు తిరస్కరించారు. ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం 83 నామినేషన్ల నుండి నేడు ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో, ఎన్ని నామినేషన్లను సదరు అభ్యర్థులు ఉపసంహరించుకుంటారో చూడాలి.

