NewsTelangana

 అభిమానులకు కృతజ్ఞతలతో… మీ అల్లు అర్జున్

సినిమాలలో తన నటజీవితానికి ఇరవయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిత్రపరిశ్రమకు వచ్చి 20 సంవత్సరాలు పూర్తయ్యిందని, నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలని, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకుల ఆదరాభిమానాలే కారణమని పేర్కొంటూ సోషల్ మీడియాలో స్పెషల్‌గా పోస్టు చేశాడు.  అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. పదహారేళ్ల చిన్నవయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రతీ సినిమాలోనూ వైవిధ్యమైన నటన చూపుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని, ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అనే బిరుదులను సంపాదించాడు బన్నీ.

ఆర్య, దేశముదురు, అలవైకుంఠపురంలో, రేసుగుర్రం, పుష్ప వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. పుష్ప సినిమాతో పాన్‌ఇండియా స్టార్‌గా పేరుతెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా టీజర్‌ను బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయబోతున్నారు.