నాని, వివేక్ ఆత్రేయల మాస్ యాక్షన్‌తో.. ‘సరిపోదా శనివారం’
నాచురల్ స్టార్ నాని ఇప్పుడు పలు డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో సినిమాల్లో విజృంభిస్తున్నాడు. ఒకో సినిమాకి ఒక్కో యాంగిల్ – లుక్స్‌ని కూడా ప్రెజెంట్ చేస్తూ వరుస హిట్స్‌తో వెళ్తున్న నాని ఇప్పుడు చేసిన సాలిడ్ చిత్రమే “సరిపోదా శనివారం”. దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్లాన్ చేసిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఓ రేంజ్‌లో దూసుకు వెళ్ళబోతోంది. లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్ చూస్తే మాత్రం ఈసారి నాని, వివేక్ ఆత్రేయల మాస్ సంభవం తప్పనిసరి అనేలా ఉందని చెప్పాలి. అయితే వీరి కాంబినేషన్‌లో వచ్చిన లాస్ట్ చిత్రం అది కూడా క్లాస్ చిత్రం “అంటే సుందరానికీ” ఒక్క యూఎస్ మార్కెట్ మినహా తెలుగు స్టేట్స్‌లో అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్ కనబడలేదు. కానీ నెమ్మదిగా ఈ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మరి ఆ క్లాస్ సినిమాతో కొట్టని హిట్‌ని అయితే ఈసారి మాస్ సినిమాగా వడ్డీతో సహా వసూలు చేసేలా ప్లాన్ చేసుకున్నారనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అంతా కూడా అదరగొట్టగా నిన్న ట్రైలర్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలా మొత్తంగా మాత్రం ఇద్దరూ మాస్ యాక్షన్ చూపించేలా ఉన్నారని చెప్పాలి. మరి అది తేలాలి అంటే ఈ ఆగస్ట్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.