CSK VS GTమ్యాచ్‌తో.. వ్యూయర్‌షిప్ రికార్డులు బ్రేక్
ఈ IPL సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి IPL జట్టుల ప్లేయర్స్ తమ ఆటతో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన CSK VS GT తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ IPLలో ఇప్పటివరకు ఉన్న వ్యూయర్ షిప్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో సినిమాలో ప్రసారమయ్యే ఈ మ్యాచ్‌ను ఏకంగా 2.5 కోట్లమంది ప్రజలు వీక్షించారు. కాగా ఈ సీజన్‌లో ఈ మ్యాచ్ అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో GT పై CSK టీమ్ విజయం సాధించింది. దీంతో CSK టీమ్ నేరుగా IPL ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో CSK టీమ్ సభ్యులతోపాటు అభిమానులు సంబారాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో జరిగిన CSK VS RCB మ్యాచ్‌ను 2.4కోట్లమంది,RCB VS GT మ్యాచ్‌ను 2.2 కోట్లమంది,CSK VS RR మ్యాచ్‌ను 2.2 కోట్లమంది వీక్షించారు. అయితే దీన్ని బట్టి చూస్తే CSK టీమ్ ఎప్పుడూ మ్యాచ్ ఆడినా భారీగా వ్యూయర్‌షిప్ సొంతం చేసుకోవడం గమనార్హం.

