ఏఐ తో ఇక శ్రీవారి దర్శనం సులభతరం
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకు టెక్నాలజీ వినియోగమే ఉత్తమ మార్గమని భావించిన నేపథ్యంలో గూగుల్‌తో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్)ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. వారం, పది రోజుల్లో టీటీడీ-గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తును పూర్తిచేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని(కృత్రిమ మేధ) వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి.