హైదరాబాద్‌లో విప్రో భారీ ఆఫర్స్
హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త సెంటర్‌కు విప్రో కంపెనీ అంగీకరించింది. దీని ద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. దావోస్‌లోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయనను కలిశారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.


 
							 
							