ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి,డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం 19 రోజులు పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని,ఇందులో 16 బిల్లులు ఆమోదం కోసం ప్రవేశపెడతారని పార్లమెంట్ వ్యవహారాల కమిటి పేర్కొంది.కాగా ఇదే సమావేశాల్లో జమిలి ఎన్నికల అంశంకి సంబంధించిన బిల్లుని కూడా ప్రవేశపెడతారా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు. జమిలి బిల్లుకు ఇదే సమావేశాల్లో ఆమోదం లభిస్తే ఇక 2027 కల్లా వన్ నేషన్…వన్ ఎలక్షన్ ఖాయమైనట్లే.