తీరం దాటిన వాయుగుండం
వారం రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కలకత్తాకు వంద కి.మీ దూరంలో తీరం దాటింది. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు, 40-50 కిమీ వేగంతో ఈదుగు గాలులు వీస్తాయి. ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాం పట్నం, కృష్ణపట్నం లలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. మత్స్యకారుల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.