ఫీజు పోరుని జయప్రదం చేయండి
వైఎస్సార్సీపి అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ మాజీ మంత్రి,అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.ఈమేరకు గుంటూరులో ఆయన దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ… విద్యార్ధుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి వారి భవిష్యత్తుని అందకారమయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి నిరశనగా జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు.బాధిత విద్యార్ధులు,వారి తల్లిదండ్రులతో కలిసి ఈ నిరశన పోరును నిర్వహించబోతున్నామన్నారు.ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శాంతియుత ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించబోతున్నామని అంబటి పేర్కొన్నారు.కావున విద్యార్ధులు,వారి తల్లిదండ్రులు ఈ ఫీజుపోరులో భాగస్వాములయ్యి ప్రభుత్వానికి నిరశన గళం వినిపించాలని ఆయన విజ్క్షప్తి చేశారు.

