Home Page SliderTelangana

“నువ్వొస్తావా..నన్ను రమ్మంటావా”..ఎమ్మెల్యేల పోటాపోటీ  సవాల్

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ లోగా వారి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా హీటెక్కాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సవాల్ విసిరారు. మీ ఇంటికొచ్చి, బీఆర్‌ఎస్ కండువా కప్పుతానని, జెండా ఎగురవేస్తానని సవాల్ చేశారు. శేరిలింగంపల్లి నుండి బీఆర్‌ఎస్ పార్టీ నుండి ఎన్నికై, కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీపై విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. నువ్వు రాలేకపోతే నేనే మీఇంటికొస్తా అంటూ సవాల్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటి నుండి బయటకు రాకుండా గృహనిర్భందం చేశారు పోలీసులు. తమ పార్టీ నుండి గెలిచిన అరెకపూడి గాంధీకి ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా పదవి ఇవ్వడంపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.