అమ్మాయిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా..?
వైఎస్సార్‌సీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తనకి రిలేషన్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ సుమయా ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒక ఫోటో వీడియో ఆధారంగా.. తన క్యారెక్టను దిగజార్చేలాగా వ్యవహరించొద్దన్నారు. తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు సుమయా.