ప్రభుత్వంపైనే ప్రెస్ మీట్ పెడతావా..?
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల సినీ నిర్మాతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత గంటల వ్యవధిలో అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి.. తన వ్యక్తిత్వ హననం చేశారంటూ సీఎంను ఉద్దేశించి మాట్లాడటాన్ని సినీ నిర్మాతలు తప్పుపడుతున్నారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటున్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే ఇండస్ట్రీ మనగలుగుతుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా గ్యాప్ పెరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఓయూ జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఉండకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.