కండీషన్ బెయిల్ పై ఉండి ప్రెస్ మీట్ పెడతావా?
లగచర్ల కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డికి పోలీసులు చుక్కలు చూపుతున్నారు.కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేశారు. కొత్త సంవత్సర వేడుకలు ముగియగానే 2న మళ్లీ పోలీసు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్రెస్ మీట్ పెట్టారంటూ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.దీనిపై విచారణకొచ్చి వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.జైలు నుంచి బయటకొచ్చాక..కేటిఆర్ పేరు చెప్పాలంటూ పోలీసులు తనను వేధించారని ఆరోపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో పోలీసులు మళ్లీ నోటీసులిచ్చారు.

