Home Page SliderTelangana

పొడిగిస్తారా.. ప్రత్యేక పాలన!

తెలంగాణలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన తరువాత ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. జులై 4న జిల్లా, మండల పరిషత్ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. వారిని కొనసాగిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. బీసీ జనగణన చేపట్టి ఆ తర్వాత గ్రామపంచాయతీ, ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ఒకవైపు ప్రభుత్వం ఆలోచనలో పడింది.