Andhra PradeshHome Page SliderPolitics

ఫించను 3 గంటలు ఆలస్యమైతే ప్రపంచం తలకిందులవుతుందా..

ఏపీలో ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశోం మాట్లాడుతూ ఉద్యోగులను చాలా ఇబ్బందులు పెడుతున్నారని, గ్రామ సచివాలయ ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో ప్రజల ఇళ్లకు వెళ్లి వారి తలుపు తట్టి నిద్ర లేపి ఫించన్లు పంపిణీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగినులకు ఇది చాలా ప్రమాదంగా మారిందని, వారు వేరే ఊర్లో ఉంటే, అర్థరాత్రి ప్రయాణాలు చేసి వస్తున్నారని, 5 గంటలకు  కాకుండా, 8 గంటలకు ఫించన్లు ఇస్తే ఏం నష్టం వచ్చింది అని ప్రశ్నించారు. 3 గంటలు ఆలస్యమైతే ప్రపంచం తలకిందులవుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, ఐఆర్‌ల గురించి అసలు పట్టించుకోవడం లేదని, కనీసం సంక్రాంతికైనా వాటిని ఇవ్వాలని కోరారు. ఉద్యోగులను ఇబ్బందులు పెట్టేవారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు.