ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయ్? కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కొత్త వాదన తీసుకొచ్చారు. ప్రాంతీయ పార్టీల సమూహం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, ఎన్‌డిఎ, ఇండియా కూటమి, మద్దతు ఇవ్వాల్సి రావచ్చన్నారు. తెలంగాణలోని 17 నియోజకవర్గాలలో పార్టీ, ఎలా రెండంకెల సీట్లను సాధిస్తుందో కూడా మాట్లాడారు. బీజేపీ అవకాశాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో తన కుమార్తె కె కవిత అరెస్టు వంటి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకరైన నామా నాగేశ్వరరావు కోసం జరిగిన ర్యాలీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ అధినేత నాగేశ్వరరావు కేంద్ర మంత్రిగా మారొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, ఎన్డీయేకు లేదా భారత కూటమికి మద్దతిస్తారా అని అడిగినప్పుడు, “మీరు నమ్మని ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను, ఈసారి దేశంలో కొత్తది జరగబోతోంది. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ పార్టీలకు ఎన్డీఏ, లేదా ఇండియా కూటమి మద్దతివ్వాల్సి వస్తుందన్నారు.”
2019లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో తొమ్మిదింటిని గెలుచుకుంది. 2014లో ఏర్పడినప్పటి నుండి దాదాపు దశాబ్దం పాటు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 119 సీట్లలో 64 సీట్లను గెలుచుకుంది, సొంతంగా మెజారిటీని సాధించింది. BRS పార్టీ ఓటమితో లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. “మహిళలకు ఉచిత బస్సు హామీ మాత్రమే అమలవుతోందని, అది కూడా పెద్ద జోక్‌గా మారింది. మహిళలు బస్సులలో కొట్లాడుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. అందుకే ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. రైతులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, 12 సీట్లు సాధించేలా చేస్తాయి. ”అని అన్నారు. తమ పాలనలో ప్రజలకు స్థిరమైన విద్యుత్, తాగునీరు, సాగునీటి సరఫరా నిరంతరాయంగా జరిగాయన్నారు. కానీ, కాంగ్రెస్ హామీలతో ప్రజలు “ప్రలోభాలకు” గురయ్యారన్నారు. “కాంగ్రెస్ చాలా ఆకర్షణీయమైన వాగ్దానాలు చేసారు. కాంగ్రెస్, BRS మధ్య (ఓట్ల వాటా) మార్జిన్ 1.8% ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో మూడింట ఒక వంతు సీట్లను గెలుచుకున్నాం, ఇది చిన్న విషయం కాదు. ఇది ఓటమి కాదు. ప్రలోభాలకు లొంగిపోయి, కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఎక్కువ హామీలివ్వడంతో ఓడిపోయాం. కానీ కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని, వారు ప్రజలను మోసం చేశారని అన్నారు.

రాజకీయాల్లో ‘పొద్దుతిరుగుడు పువ్వులు’
బీఆర్ఎస్ పార్టీ నుంచి “కొద్ది మంది మాత్రమే పార్టీ నుండి బయటకు వెళ్ళారు… రాజకీయాల్లో ఇది సాధారణం. అధికారం మారినప్పుడల్లా ప్రతి పార్టీలో నిర్దిష్ట సంఖ్యలో పొద్దుతిరుగుడు పువ్వులు ఉంటాయి.. వారు అవసరానుసారం పార్టీలు మారుతుంటారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకోగా, ఈసారి రాష్ట్రంలో రెండంకెలకు చేరుకుంటుందని ఆ పార్టీ ప్రకటించింది. దీనిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. “బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని నడుపుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు లేదంటే అది కూడా రాదని కేసీఆర్ చెప్పారు. 2019లో దక్షిణ భారతదేశంలోని 130 (పుదుచ్చేరితో కలిపి)లో 29 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి 10కి మించి గెలవదని, జాతీయ స్థాయిలో ఎన్డీయే కేవలం 226 సీట్లకు తగ్గుతుందని మాజీ ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. “ప్రధానమంత్రి తన చరిష్మాను కోల్పోయారు. ప్రజలు దానిని గ్రహించారు. రూపాయి విలువ దాని కనిష్ట స్థాయికి పడిపోయింది. భారతదేశం నుండి ఇప్పుడు మూలధన ప్రవాహం ఉంది. రైతులు కోపంగా ఉన్నారు, చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.

కవిత అరెస్ట్
మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన కుమార్తె, బిఆర్‌ఎస్ నాయకురాలు కె కవితను అరెస్టు చేయడానికి కారణాలు చెప్పారు కేసీఆర్. తెలంగాణలో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్య తీసుకున్నందున బిజెపి ఆ పని చేసిందని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వేటాడినందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై నమోదైన కేసును ప్రస్తావిస్తూ, “మోదీని అతని అనేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి నేనే.. నా పోలీసు బలగాలను అక్కడికి పంపాను. బీఎల్ సంతోష్‌ను పట్టుకునేందుకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం పంపడం వల్ల, కవితను తప్పుడు కేసులో అరెస్టు చేశారన్నారు. “అంతిమంగా, మేము న్యాయవ్యవస్థను నమ్ముతాం, ఈ రోజు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చింది, నా కుమార్తెకు కూడా బెయిల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ స్కామ్ కాదు. ప్రతి రాష్ట్రానికి మద్యం పాలసీ ఉంది. ఒక్క రూపాయి రికవరీ కాలేదు. నా కూతురుతో పాటు అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా వారు డ్రామా ఆడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి బీజేపీలో?
కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీలోకి మారతారని కేటీఆర్ చేసిన ప్రకటనపై ప్రశ్నించగా… రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని తన పెద్ద అన్న అని పిలిచిన తీరును బట్టి తెలుస్తోందని కేసీఆర్ అన్నారు. “ముందుకు వెళ్లడానికి మాకు మోదీ మద్దతు అవసరమని చెప్పారు. దాని అర్థం ఏమిటి? రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని అంగీకరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో ఉన్నాడు. 2015 ఓటుకు నోటు కోసం ఎదురు చూస్తున్నాడు. జూన్ లేదా జులైలో విచారణ ముగుస్తుందని భావిస్తున్నాను. కాంగ్రెస్ నుండి కూడా బిజెపిలోకి జంప్ అవుతాడని అనుకుంటున్నాను. ఇక రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలను కేసీఆర్ ఖండించారు. ఇది పూర్తిగా పోలీసుల పరిధిలో ఉందని అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలను కేసీఆర్ కొట్టిపారేశారు. కాళేశ్వరం ఒక అద్భుతమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతించమని, ప్రధాని చెప్పడంపై “రాజ్యాంగం అనుమతిస్తుందా అనేది ఒక అంశమే అయినప్పటికీ… అది ముస్లిం లేదా హిందువులు కానివ్వండి… ఏది ఏమైనప్పటికీ, తమ వాటాను పొందని ప్రజలు, పేదలు, రిజర్వేషన్లకు అర్హులైన వారు రిజర్వేషన్లు పొందాలి.” అని చెప్పారు.