Home Page SliderNational

18 మంది సిక్కు బృందం ఒత్తిడితో మూవీ రిలీజయ్యేనా?

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకి తెలంగాణలో రిలీజ్‌ చేయడానికి మోకాలొడ్డుతున్న ప్రభుత్వ యంత్రాంగం. కుంటిసాకులతో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి సిక్కులకు హామీ ఇచ్చారు. సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులుగాను, దేశద్రోహులుగాను చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద తమ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం తొందరలోనే ఏ విషయం చెబుతామని సిక్కు బృందానికి హామీ ఇచ్చారు.