Breaking NewsHome Page SliderPoliticsTelangana

బ‌డ్జెట్‌లో తెలంగాణాకు ప్ర‌తీ సారి మొండి చెయ్యేనా

తెలంగాణ‌లో 8 మంది కాంగ్రెస్ ఎంపిలు, మ‌రో 8 మంది బీజెపి ఎంపిలు క‌లిసి రాష్ట్రానికి గుండు సున్నా తెచ్చార‌ని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు.కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణా ఊసే లేకుండాపోయింద‌న్నారు .బీహార్‌,ఏపికే అధిక నిధులు కేటాయించార‌ని చెప్పారు.దేశ‌మంటే మ‌ట్టికాదోయ్ …దేశ‌మంటే మ‌నుషులోయ్ అని ఉద్ఘాటించిన గుర‌జాడ‌ను గుర్తు చేసుకుని మ‌రీ దేశం అంటే 29 రాష్ట్రాలోయ్…దేశ‌మంటే తెలుగు దేశం,బీజెపి కాదోయ్ అనే సంగ‌తి ఎలా మ‌ర్చిపోయి తెలంగాణ ప‌ట్ల స‌వతి త‌ల్లి ప్రేమ చూపించార‌ని మండిప‌డ్డారు.కాంగ్రెస్ పార్టీ , బీజెపిల వ‌ల్ల తెలంగాణాకు ఒరిగేదేమీ లేద‌ని ఈ బ‌డ్జెట్‌తో తేట‌తెల్లం అయ్యింద‌న్నారు.