NewsTelangana

మెగాస్టార్ సినిమాకి కూడా కాపీ ట్యూనేనా..

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ది గాడ్ ఫాదర్. ఈ సినిమా టీజర్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిన్న (సోమవారం) విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీకి S.S తమన్ మ్యూజిక్ అందించారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమా (BGM) బీజీఎమ్ వరుణ్ తేజ్ నటించిన గనీ మూవీ టైటిల్ సాంగ్ లా ఉందని తమన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

తమన్ ఎప్పటిలాగానే BGMని కాపి చేసి మెగాస్టార్ మూవీలో దించేశాడంటూ తమన్‌పై సోషల్ ‌మీడియాలో దానికి సంబందించిన మూవీ టీజర్‌ వీడీయోస్‌ను పెట్టి తెగ వైరల్‌ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకి కూడా కాపీ కొడతారా అని తమన్‌పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో పాటు తమన్ పాత్రను ఎండగట్టారు. అయితే గని చిత్రానికి కూడా తమన్‌నే మ్యూజిక్ అందించారు.