ఆర్జీవీని అరెస్టు చేస్తారా?
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను అరెస్టు చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ గోపాల వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. మద్దిపాడులో ఆర్జీవీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్ర ప్రమోషన్స్ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లను కించపరిచారని, వారి వ్యక్తిత్వాలను అగౌరవపరిచేలా సీన్లు ఉన్నాయని, సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదయ్యింది. దీనితో వర్మకు సమన్లు ఇస్తారని సమాచారం.