సత్తెనపల్లి నాదే.. ఎవరికిచ్చినా ఊరుకునేది లేదు!
••బాబు సంకనెక్కితే బలి పశువు పవనే
•జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ప్రజల్లో ఆకాంక్ష
•గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో అంబటి
ఎవరి కోసమో పార్టీ పెట్టి, బాబు ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో ఆయన సంకనక్కితే బలి పశువు అయ్యేది పవన్ కళ్యాణేనని… అలాంటి వారిని నమ్మాలా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సత్తెనపల్లి నియోజకవర్గం, గణపవరం గ్రామంలో సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల శిక్షణ తరగతుల్లో రాంబాబు పాల్గొన్నారు. తోడేళ్లు ఎన్ని ఏకమైనా అంతిమ విజయం వైయస్సార్సీపీదే అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి జగనే కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలియంగా ఉందన్నారు. పారదర్శక సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సత్తెనపల్లి నాది, నాది అని చాలామంది తిరుగుతున్నారని ఈ మధ్య కొత్తగా కూడా ఒకాయన వస్తున్నారని ఎంతమంది వచ్చినా మనకు భయం లేదన్నారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ఉత్సవాలలో గృహ సారధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంయుక్తంగా కృషి చేయాలని రాంబాబు సూచించారు.