పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడతాడా?
వైఎస్ జగన్ పై ఒంటి కాలిపై లేచే కూటమి ప్రభుత్వ నాయకులు…తిరుపతి ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తిరుమల,తిరుపతి క్షేత్రాల్లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పేరిట రాజకీయాలు చేసిన మూడు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది.వైకుంఠ దర్శన టికెట్ల కోసం క్యూలో వేచి ఉన్న భక్తుల తొక్కిసలాట కారణంగా 7గురు భక్తులు చనిపోయారు.దీనిపై డిసీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడతాడా అని ప్రతిపక్షాలు,సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఆనాడు లడ్డులో కల్తీ జరిగిందని ఇంద్రకీలాద్రి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్…ఇవాళ తిరుపతి ఘటనలో ఏడుకొండల వారి మెట్లు కడుగుతారా అని ప్రశ్నిస్తున్నారు.కల్తీ జరగని లడ్డులో కల్తీ జరిగిందని భావించి మెట్లు కడిగిన పవన్….ఇప్పుడు నిజంగా భక్తులు ప్రాణాలు పోయాయి….కనీసం 1000 మెట్లు అయినా కడిగితే తప్ప…ఆయన ప్రాయశ్చిత్తం పోయేట్లు లేదు.