అప్లై చేయకుండా మెడికల్ కాలేజ్ సాంక్షన్ చేస్తారా?
కరీంనగర్: దేశంలో 157 వైద్య కళాశాలలను మంజూరు చేసిన ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ అనడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. దరఖాస్తు చేయని ఆయనకు వాటి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బండి సంజయ్. శుక్రవారం కరీంనగర్ రూరల్‌లో చామనపల్లిలో, జిల్లా కేంద్రంలోని కొన్ని డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

