Home Page SliderTelangana

ఈడీ ముందు ఇవాళ కవిత హాజరవుతారా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇవాళ విచారణకు హాజరవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులిచ్చింది. కేసు విచారణ కీలక దశకు చేరిన నేపథ్యంలో కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమయ్యింది. ఈ నెల 11న కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ 16న విచారణకు రావాలని కోరింది. ఐతే కవిత హాజరు కాలేదు. కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే కవిత విచారణ విషయంలో ఈడీ, సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ కవిత ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈడీ విచారణ కోసం కవిత ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. కవితతో పాటు సోదరుడు, ఐటీ మంత్రి కేటీఆర్ సైతం ఢిల్లీ చేరుకున్నారు.