Home Page SliderNational

ఐటీఆర్ ఫైలింగ్ గడువు జూలై 31 తర్వాత పొడిగిస్తారా? ప్రభుత్వం ఏమంది?

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ అని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. నివేదికలు, ఊహాగానాలకు విరుద్ధంగా, ఈ సంవత్సరం గడువు పొడిగింపు ఉండదని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. జరిమానాలు లేదా చివరి నిమిషంలో ఇబ్బందులను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయాలని కేంద్రం కోరింది. జూలై 26 నాటికి ఐదు కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని… గత ఏడాదితో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగిందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

“5 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITRలు) మైలురాయిని చేరుకోవడంలో మాకు సహాయం చేసినందుకు పన్ను చెల్లింపుదారులు & పన్ను నిపుణులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.” అంటూ Xలో ఆదాయపన్ను శాఖ అభిప్రాయపడింది. అనేక మంది పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు పన్ను ఫైలింగ్ పోర్టల్‌తో సమస్యలను ఫ్లాగ్ చేస్తున్నప్పటికీ ఇదే ఫైనల్ అని పేర్కొంది. OTPలను రూపొందించడంలో లోపాలు, రాయితీలను క్లెయిమ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

ఇబ్బందుల కారణంగా గడువును పొడిగించాలని కోరుతూ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు పన్ను శాఖకు లేఖ రాశాయి.
జరిమానాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను సమయానికి సిద్ధం చేసి దాఖలు చేయాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. రేపటితో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనుంది.

జూలై 31 ITR ఫైలింగ్ గడువులోగా చేయకుంటే ఎన్నో సమస్యలు

1) పాత పన్ను విధానంలో ప్రయోజనాలను కోల్పోవడం
2) కొత్త పన్ను వ్యవస్థలోకి వెళ్లలేకపోవచ్చు. ఎక్కువ మినహాయింపులు కోల్పోవచ్చు.
3) ఆలస్య ఫైలింగ్ ఫీజు ₹ 5,000 (₹ 5 లక్షల కంటే తక్కువ ఆదాయానికి రూ. 1,000)
4) బకాయి ఉన్న పన్నుపై నెలకు 1 శాతం వడ్డీ
5) భవిష్యత్‌లో వచ్చే ఆదాయం ద్వారా, అంతకు ముందు నష్టాలను తగ్గించుకొని అవకాశం కోల్పోతారు.