ఈసారి ఇస్లామాబాద్ పై భారత్ దాడి ?
పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో భారత్ దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్వాపూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఇదెలా ఉండగా మరోవైపు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో వార్ సైరన్ మోగింది. దీంతో ఇస్లామాబాద్ పైనా దాడి జరగొచ్చని పాక్ భయపడుతోంది. వార్ సైరన్ మోగిస్తూ పాక్ ఆర్మీ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పట్ట పగలే జరుగుతున్న దాడులతో పాకిస్తాన్ సైన్యం బెంబేలెత్తుతూపోతోంది.