దిల్‌రాజు పొలిటికల్ ఎంట్రీ షురూ కానుందా?
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు రాజకీయాల్లోకి రానున్నారని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిల్‌రాజు దీనిపై స్పందించారు. రాజకీయాల్లోకి రావాలని తనను పలువురు నేతలు ఆహ్వానిస్తున్నారని దిల్‌రాజు తెలిపారు. అయితే పొలిటికల్ ఎంట్రీపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒకవేళ దిల్‌రాజు రాజకీయాలలోకి వస్తే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం దిల్‌రాజు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన నిర్మించిన చిన్న సినిమా “బలగం” సైతం కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా ఆయన ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్నారు.


 
							 
							