Home Page SliderNational

దీపికా ఇండియాలోనే తన బిడ్డకు జన్మనిస్తుందా?

సెప్టెంబర్ నెలాఖరులో దీపికా పదుకొణె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఒక వార్తా పత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం, దీపికా డెలివరీ కోసం ముందుగా లండన్‌కు వెళ్తుందని ఒక వార్త వెలువడింది, అయితే ఆ ప్లాన్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది. దీపికా, రణవీర్ సింగ్ ఫిబ్రవరిలో ఆ ముచ్చట గూర్చి ముందుగానే చెప్పారు. డెలివరీ కోసం ఆమె ఏ ఆసుపత్రిలో జాయిన్ అవుతారన్నది ఇంకా ఏమీ తెలియరాలేదు., అయితే అది దక్షిణ ముంబైలోని H N రిలయన్స్ ఆసుపత్రి కావచ్చు, ఇక్కడే చాలామంది సినీ యాక్టర్లు శిశువులకు జన్మనివ్వడానికి ఉత్సాహం చూపుతారు. అంబానీ 2014  అక్టోబర్‌ నెలలోనే ఈ ఆసుపత్రిని టేక్ ఓవర్ చేశారు. అప్పటి నుండి ఆయనే ఓనర్‌గా ఈ ఆసుపత్రిని నడుపుతున్నారు.