Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ గారు ఈ నెంబర్ ఎంతో చెప్తారా..?:టీడీపీ

ఏపీలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ చేసిన అప్పులపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ పార్టీ ఏపీ అప్పులపై తాజాగా ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఏపీ “అప్పులు,చెల్లింపుల భారం రూ.1,01,18,37,00,000 కోట్లు అని టీడీపీ పేర్కొంది. అసలు ఆ లెక్క ఎంతో చెప్తారా వైఎస్ జగన్.ఇది పుస్తకాల్లో కనిపించే లెక్క మాత్రమే. దాచేసి,తెచ్చేసి దోచేసింది మరో రూ.4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. సీఎం జగన్ మొత్తం రూ.15 లక్షల అప్పుల భారం ప్రజల నెత్తిన పెట్టి,వెళ్లిపోతున్నావ్ కదా జగన్” అని టీడీపీ తన ట్విట్‌లో పేర్కొంది.