స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు విముక్తి లభిస్తుందా?
స్కిల్ కేసులో చారిత్రాత్మక తీర్పును వెలవరించనున్న సుప్రీంకోర్టు
మిగిలిన అన్ని కేసులపై ప్రభావం చూపనున్న సుప్రీంకోర్టు తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించనున్నది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విముక్తి లభిస్తుందా లేక ప్రతికూలమైన తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా 17 ఏ పై సుప్రీంకోర్టు ఏ విధంగా ఉంటుందన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో మధ్యంతర బైలుపై బయటికి వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు చంద్రబాబుపై పెట్టిన కేసులు అన్నింటి పై ప్రభావం చూపనుంది.

దీంతో తెలుగు తమ్ముళ్లతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై నేడో రేపు తీర్పు వెళ్ళవడనుంది. చంద్రబాబుపై ఉన్న మిగిలిన కేసులు విచారణ కూడా ఈ కేస్ పైన ముడిపడి ఉండటంతో సుప్రీంకోర్టు ఈలోగా దీనిపై తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు వెలువరించే ఈ తీర్పు ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టు తీర్పు ఇస్తే స్కిల్ కేసు తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ మద్యం ఇసుక పాలసీ కేసులన్నీ కూడా నీరుగారి పోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే చంద్రబాబుకు పూర్తిస్థాయిలో ఊరట లభిస్తుందని చెబుతున్నారు.

ఒకవేళ చంద్రబాబుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే సిజేఐ బెంచ్‌కి వెళ్లే ఆలోచనలో చంద్రబాబు న్యాయవాదులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి వారు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా లేక ప్రతికూలమైన తీర్పు వస్తుందా అన్న టెన్షన్లలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. తీర్పు అనుకూలంగా రావాలని ఇప్పటికే పూజలు చేస్తున్నారు. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అధినాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎలా ఉంటుందన్న టెన్షన్ సర్వత్ర నెలకొని ఉంది.