2.0లో తోడుగా ఉంటా….
కోవిడ్ కారణంగా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాటు కార్యకర్తలకు తోడుగా ఉండలేకపోయానని,కానీ జగన్ 2.0లో కచ్చితంగా అందుబాటులో ఉంటానని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపి నేతల సమావేశంలో జగన్ పాల్గొని మాట్లాడారు. కూటమి కంటే వైసీపికి గత ఎన్నికల్లో కేవలం 10 శాతం ఓట్లే తక్కువ వచ్చాయని కానీ సీట్లు తగ్గడానికి గల ప్రధాన కారణం తాను చంద్రబాబు లా అబద్దాలు చెప్పకపోవడమే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముసలోళ్లు కూడా బటన్లు నొక్కుతారని వ్యంగ్యంగా మాట్లాడిన నేటి సీఎం ఇప్పుడెందుకు బటన్లు నొక్కలేకపోతున్నారని సెటైర్లు విసిరారు.ఎన్నికల హామీలను చంద్రబాబు బుట్టదాఖలు చేశారన్నారు.కార్యకర్తల ఇంటికి పెద్దన్నగా ఉంటానన్నారు. రానున్న కాలంలో మరిన్ని మోసపూరిత,అబద్దపు కేసులు పెడతారని వాటిని ఎదుర్కొనేందుకు మన వాళ్లు సిద్ధంగా ఉండాలని సూచించారు.