భూమిమీదకు ‘నాసా’ శాటిలైట్ పడిపోనుందా?
కాలం చెల్లిన ఉపగ్రహం ఒకటి భూమి మీదకు పడిపోతుందేమో అని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. నాసా ప్రయోగించిన 21ఏళ్ల క్రిందటి ఈ శాటిలైట్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు. భూమి వాతావరణంలోకి నెమ్మదిగా జారి పడిపోనుంది. దీనిపేరు రెస్సీ. అయితే భయపడనవసరం లేదని, ఇది భూమి వాతావరణంలో ప్రవేశిస్తే చాలా వరకూ ఆకాశంలోనే మండిపోవచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు. కొన్నిభాగాలు మాత్రం భూమిని చేరుకోవచ్చు. ఈ ఉపగ్రహం బరువు 300 కిలోలు. ఇది ఏప్రదేశంలో పడే అవకాశాలు ఉన్నయో చెప్పలేకపోతున్నారు.

