Home Page SliderInternational

అల్జీరియాలో కార్చిచ్చు…సైనికులతో సహా25మంది మృతి

అల్జీరియా అడవులలో కార్చిచ్చులు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు సహా 25 మంది మరణించినట్లు సమాచారం. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అగ్నిజ్వాలలను అదుపుచేయడానికి ప్రయత్నించిన 10 మంది సైనికులు కూడా వాటికి ఆహుతైపోవడం విషాదం కలిగిస్తోంది. అక్కడ గాలులు వేసవి తీవ్రతతో చాలా బలంగా వీచడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. ఈ మంటలు అతివేగంగా అడవులలో వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకూ 15 మంది మృతితో పాటు 24 మంది తీవ్రంగా గాయపడినట్లు అల్జీరియా రక్షణమంత్రి ప్రకటించారు. బెనిక్సిల అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, సైనికులు ఈ ప్రాంతంలోనే మరణించారని తెలియజేస్తున్నారు. ఈ మంటలు బలమైన గాలులు వీస్తున్న కారణంగా ఇప్పట్లో అదుపుచేయడం కష్టమని, ఇవి అడవుల మీదుగా ఉత్తర ఆఫ్రికాలోని 16 ప్రాంతాలలో పంటపొలాలలోకి కూడా వ్యాపించవచ్చని తెలుస్తోంది. వీటిని అదుపుచేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. వీటిలో 7,500 అగ్నిమాపక సిబ్బంది, 350 ట్రక్కులతో  కృషిచేస్తున్నారు.