భర్తను చంపి.. పాము కాటు వల్ల చనిపోయాడని నమ్మించిన భార్య
ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపింది. అంతేకాకుండా ఆమె శవం పక్కన పామును వేసి పాముకాటు వల్ల చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ – మీరట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమిత్ కశ్యప్ (25) అతని భార్య రవితతో కలిసి నివసిస్తున్నాడు. అమిత్ స్నేహితుడు అమర్ దీప్‌కు, రవితకు మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అమిత్, అమర్ దీప్ రవితలతో గొడవ పడ్డాడు.. దీంతో అమిత్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి గొంతు నులిమి చంపేశారు. అప్పటికే పథకం ప్రకారం రూ.1000 పెట్టి కొనుక్కొచ్చిన పామును శవం పక్కన వేశారు. అమిత్ పాముకాటుతో చనిపోయాడని రవిత ఉదయం లేచి ఏడ్చి అందరిని నమ్మించింది. అమిత్ శవానికి పోస్ట్ మార్టం చేయగా గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లను డాక్టర్లు గుర్తించారు. పోలీసులు అమర్ దీప్‌ను, రవితను గట్టిగా నిలదీయడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో వాళ్లిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.