భర్త ఇంటి ఎదుట భార్య నిరసన
భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చేసుకుంది. బోనకల్ మండలంలోని కలకోట మాలపల్లికి చెందిన అమ్మాయి.. బ్రాహ్మణపల్లికి చెందిన అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరి అంగీకరంతో ఖమ్మంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం యువకుడు గత కొన్ని రోజులుగా యువతిని పట్టించుకోవడం లేదు. దీంతో అమ్మాయి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బ్రాహ్మణపల్లిలో ఉన్న భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తానని ఇంటి ముందు నిరసన చేపట్టింది.

