జీడిమెట్ల ఆటో డ్రైవర్ హత్య… భార్య పనే!
ఈ మనిషులేంటో.. ఈ పనులేంటో..
సరదాల కోసం జీవితాలు బలి
భర్త మెప్పు పొందాలని బాలికతో వివాహం
వదిలించుకోవాలని చూస్తున్నాడని భర్త హత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య కూడా అగాధాలు ఏర్పడుతున్నాయ్. కష్టపడి పనిచేస్తే తప్ప జీవితం సాగదని తెలిసి కూడా, ఫ్రీ మనీ కోసం ఆశపడుతూ కొందరు విలాసాల బారినపడి పండంటి సంసారాన్ని రోడ్డునపడేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ జీడిమెట్లలో ఆటో డ్రైవర్ హత్య వ్యవహారాన్ని ఛేదించిన పోలీసులకు విస్తు గెలుపే విషయాలు వెల్లడయ్యాయి. సురేష్ అని వ్యక్తిని రేణుక ప్రేమించి పెళ్లి చేసుకొంది. మొదట్లో ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఐతే కొద్ది రోజుల తర్వాత రేణుక, చెడు సావాసాలతో మందు షాపుల వద్ద, కల్లు దుకాణాల వద్ద తిష్టవేసి… అడుక్కొని మరీ మద్యం తాగడం అలవాటు చేసుకొంది. ఇదే విషయమై భర్తతోనూ గొడవలయ్యేవి. తను భర్త పట్టించుకోకూడదంటే ఏం చేయాలని ఆలోచించిన రేణుక.. భర్తకు, తన అదుపు అజ్ఞల్లో ఉండే బాలికను ఇచ్చి వివాహం చేసింది. అలా భర్త మెప్పును పొందాలని నిర్ణయించింది.

ఓ మద్యం దుకాణం వద్ద తనకు తారసపడిన ఓ అనాధ బాలికను ఇంటికి తీసుకొచ్చింది. ఆ బాలికను భర్తకిచ్చి వివాహం చేసింది. అయితే కొద్ది రోజులకే భర్త బాలికతో అన్యోన్యంగా మెలగడాన్ని చూసి…తట్టుకోలేకపోయింది. సురేశ్‌ను మట్టుపెట్టాలని భావించింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా… భర్తను ఫూటుగా తాగించి బాలిక సాయంతో… శాలువ మెడకు బిగించి చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా గోనె సంచెలో భర్త మృతదేహాన్ని ఇంటి ముందు వదిలేసింది. సురేశ్ ఎక్కడని ప్రశ్నిస్తే మల్లెపూలు, మటన్ తేవడానికి వెళ్లాడంటూ కట్టుకథలు అల్లింది. తనకేం సంబంధం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో గుట్టురట్టయ్యింది. తన భర్త సురేశ్.. తాను తీసుకొచ్చిన అమ్మాయితో జీవించాలని ప్లాన్ చేసుకోవడం… తనను వదిలించుకోవాలని చూడటంతో… తట్టుకోలేక చంపేశానని నిజం ఒప్పుకొంది. చెడు వ్యసనాలకు బానిసలైతే ఎంతటి వారి జీవితాలైనా ఇంతేనని తాజా ఘటన రుజువు చేస్తోంది.