ఏపీలో విస్తృతస్థాయిలో క్యాన్సర్ పరీక్షలు
ఏపీలో విస్తృతస్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. దాదాపు ఐదున్నర కోట్ల మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆరేళ్ల నుండి పన్నెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద పరీక్షలు చేస్తామన్నారు. దాదాపు 68 లక్షల మంది చిన్నారులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. గత వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన అప్పులు దారి మళ్లాయని, వాటిని ఎటు దారి మళ్లించారో తేల్చడానికి విచారణను చేపడుతున్నట్లు తెలిపారు.