మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలాగ ఎందుకు అరెస్టు చేశారు..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విధానాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఆయనను ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు మార్నింగ్ వాక్ సమయంలో ఎందుకు పట్టుకుని అరెస్టు చేశారని ప్రశ్నించింది. నరేందర్ రెడ్డి పరారీలో లేరే అని ప్రశ్నించింది. పైగా దాడికి గురయిన అధికారులపై సరిగ్గా నివేదికలు లేవని, నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. అయితే తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ కేసులో నరేందర్ రెడ్డి పాత్రపై తగిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని ఆదేశించింది హైకోర్టు.