Home Page SliderNational

టీమ్‌ఇండియా ప్లేయర్లు బయట ఎందుకు తడబడుతున్నారు

 WTC ఫైనల్ మ్యాచ్ ఈ నెల 7న ప్రారంభమై నిన్ననే ముగిసింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలయ్యింది. దీంతో టీమ్‌ఇండియా ప్లేయర్ల ఆట తీరుపై పలువురు క్రికెట్ ప్రముఖులు  అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా దీనిపై స్పందించారు.  ఆయన మాట్లాడుతూ..ఓవర్సీస్‌లో భారత ఆటగాళ్ల సగటు పడిపోతుందన్నారు. కాగా దీని కోసం ప్లేయర్లు ఏదో ఒకటి చేయాలని సునీల్ గవాస్కర్ సూచించారు. టీమ్‌ఇండియా జట్టు బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కాగా ఇటీవల జరిగిన IPL లో బ్యాటర్లు  అదరగొట్టారన్నారు. మరి వారు బయట మాత్రం ఎందుకు తడబడుతున్నారో అర్థం కావడం లేదని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.