‘కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వాలి?’.. కాంగ్రెస్ నేత ఫైర్
రాష్ట్రప్రభుత్వాన్ని అప్పుల్లో నెట్టేసిన బీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావడం లేదంటూ మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లాభదాయకం కాకపోయినా దాన్ని ఏర్పాటు చేయాలని చూశారు. అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి కాలేదు. రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నా, పట్టించుకోలేదు. రామగుండంలో కాకుండా యాదాద్రిలో ఎందుకు నిర్మించారు. కేసీఆర్ సభకు హాజరు కానప్పుడు ఆయన బదులు వేరేవాళ్లు ప్రతిపక్ష హోదా తీసుకోండి అంటూ ఎద్దేవా చేశారు.