Home Page SliderNational

పూజారాను ఎందుకు బలిపశువును చేశారు: గవాస్కర్

ఇటీవల జరిగిన WTC ఫైనల్లో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెస్టీండీస్‌తో జరగబోయే  టెస్ట్ సిరీస్‌లో చోటు కోల్పోయారు. కాగా పుజారా స్థానంలో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కింది. అయితే దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ పుజారాను ఎంపిక చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. బ్యాటింగ్ యూనిట్ మొత్తం విఫలమైనప్పుడు కేవలం పుజారాను మాత్రమే ఎందుకు బలిపశువును చేశారని సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. ఎందుకంటే అతన్ని తీసుకోకపోతే అతనికి సపోర్ట్‌గా నిలిచేందుకు ఎవరు లేరనే కదా అని అన్నారు. అంతేకాకుండా పుజారాకు అంతగా సపోర్ట్ చేసే మిలియన్ల మంది ఫాలోవర్లు లేరనే కదా ఇలా చేశారని సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.