ఇంకా అంతరిక్షంలోనే సునీతా..
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ సీనియర్ ఆస్ట్రోనాట్ బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ లో భాగంగా జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ సైతం ఉన్నారు. వీరు ప్లాన్ ప్రకారం జూన్ 14 నాటికి భూమి మీదకి తిరిగి రావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వీరిని చిక్కుల్లో పడేసింది.
అసలు మిషన్ ఏమిటి?
బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే.. ISS నుండి ప్రజలను సురక్షితంగా తీసుకువెళ్లే అంతరిక్ష నౌక సామర్థ్యాన్ని ప్రదర్శించడం. నాసా యొక్క కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా, బోయింగ్, ఏరోస్పేస్ కంపెనీ, అంతరిక్ష సంస్థకు సాధారణ సిబ్బంది రవాణా సేవలను అందించడంలో ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్లో చేరాలనే దాని లక్ష్యానికి ఈ పర్యటన కీలకమైనదిగా భావించింది.
నెలల గడిచిన సమస్యకు పరిష్కారం ఏంటో ఓ కొలిక్కి రాలేదు. తాజాగా దీనిపై స్పందించిన నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి వస్తారని నాసా తెలిపింది. అయితే.. అందులోని థ్రస్టర్ పని తీరు దెబ్బతినడంతో హీలియం లీకేజీ జరుగుతోంది. ఈ సమస్యల వల్ల స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను తాత్కాలికంగా ఐఎస్ఎస్ కు అనుసంధానం చేశారు. ఐఎస్ఎస్ నుంచి ఇప్పుడు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ లకు అన్ని సౌకర్యాలను అందిస్తున్నారు. వారు అక్కడికి చేరుకుని ఇప్పటికి 90 రోజులు గడిచాయి.

